![]() |
![]() |

బుల్లితెర మీద ఆలీతో సరదాగా షో ఒక రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన విషయం తెలిసిందే. ఎంతోమంది సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేసిన ఈ షో కొంత కాలం క్రితం ఆగిపోయింది. సినీ సెలబ్రిటీస్ తో పాటు అప్పుడప్పుడు ట్రెండింగ్ పర్సన్స్ ని కూడా ఈ షోకి తీసుకొచ్చారు. ఇక ఆడియన్స్ లో ఇదే ప్రశ్న వచ్చింది ..ఈ షో ఆగిపోతుందా అని. అప్పుడు ఆలీ తన షోకి తానే ఇంటర్వ్యూకి వచ్చారు.
అలా అక్టోబరు 24, 2016న ప్రారంభమైన ఈ ఆలీతో సరదాగా జర్నీ మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్‌లు వచ్చినా.. ఫైనల్‌గా ముగిసిపోయింది. అయితే ఇది కూడా ఫుల్‌స్టాప్ కాదని, కామానే అని చెప్పారు ఆలీ. అయితే ఈ కామా ఎన్ని రోజులు అనేది అప్పట్లో ఆయన చెప్పలేదు. మంచు లక్ష్మి గెస్ట్‌గా స్టార్ట్ ఐన ఈ షో ఆలీ ఇంటర్వ్యూతో ఎండ్ అయ్యింది. ఆలీతో ఇంటర్వ్యూ చేసే ఎపిసోడ్‌ను సుమ హోస్ట్‌గా నిర్వహించారు. ఐతే ఇప్పుడు ఈ షోకి ఆ కామా తీసేసి మళ్ళీ పట్టాలెక్కిస్తున్నారు. ఇక ఈ షో చేసే సెట్ ని, ఆలీ సిట్టింగ్ స్టైల్ పిక్స్ ని జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఐతే యాక్టర్ శివాజీ రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో మేకప్ వేసుకుంటూ మరో వైపు క్యారవాన్ దగ్గర ఆలీతో మాట్లాడుతూ ఆలీతో సరదాగా సెట్ లో షూటింగ్ లో కనిపించాడు. అంటే శివాజీతో ఈ సీజన్ 2 ని స్టార్ట్ చేయబోతున్నారా అనే విషయం తెలుస్తోంది.. బిగ్ బాస్ సీజన్ 7 లో నటుడు శివాజీ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరికీ ఒక మోటివేటర్ గా బాగా దగ్గరుండి గేమ్స్ ఆడించిన విషయం తెలిసిందే. మరి ఇపుడు శివాజీని ఇంటర్వ్యూ చేయబోతున్నారనే విషయం తెలుస్తోంది. మరి ఈ షోకి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా వస్తాడా అనే డౌట్స్ కూడా ఉన్నాయి ఆడియన్స్ లో చూడాలి..ఈ రాబోయే కొత్త సీజన్ లో ఎలాంటి స్టార్స్ రాబోతున్నారు అని ..
![]() |
![]() |